హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య, ఇద్దరు పిల్లలు అదృశ్యం..పీఎస్‌ను ఆశ్రయించిన భర్త

WNP: కొత్తకోట మండలం వెంకటేశ్వర కాలనీకి చెందిన సవారన్న భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు నిక్షిత, అభినవ్ ఈ నెల 14 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఫిర్యాదు చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన అనంతరం వారు కనిపించకుండా పోయారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై విక్రమ్ తెలిపారు.