హైదరాబాద్: 28°C
తెలంగాణ

15 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని ధర్నా

SRPT: వ్యవసాయానికి 15 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నూతనకల్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు తెలంగాణ రైతు సంఘం (AIKS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి కోరారు.