హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎయిర్‌పోర్టుకు అలావుద్దీన్ పేరు పెట్టాలి'

HYD: వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్ పేరు పెట్టాలని AIMIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. వరంగల్ జిల్లాకు చెందిన అలావుద్దీన్ మక్కా మసీదు ఇమామ్‌గా సేవలందించారని గుర్తుచేశారు. దేశం కోసం పోరాడిన ఆయనకు గౌరవం దక్కేలా విమానాశ్రయానికి పేరు పెట్టాలని కోరారు.