KMM: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 24న ఖమ్మం టీటీడీసీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. దీని ద్వారా అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్, భారత్ హ్యుందాయ్ సంస్థలలో 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆమె సూచించారు.
తెలంగాణ
ఈ నెల 24న మెగా జాబ్ మేళా..!


