హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ ధర్నా

NGKL: కల్వకుర్తి మండలం రావిచెడు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ మంగళవారం విద్యుత్ కోతలు నివారించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం కరెంటు కోతలు విధించడం సరికాదని అన్నారు.