హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అస్తవ్యస్తంగా డ్రైనేజీ.. ఇంట్లోకి చేరిన వర్షపునీరు

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు 10వ వార్డు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీరు మునగంటి రాజ్య లచ్చమ్మ వృద్ధ దంపతుల ఇంట్లో చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు తెలిపినా ఫలితం శూన్యమని, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.