హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

GDWL: జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జల వనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం IDOC కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SC ఆదేశాల మేరకు కుంటలు, చెరువులు, రిజర్వాయర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు.