హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాల మహానాడు మండల అధ్యక్షుడిగా బోడ బాపన్న

BHPL: కాటారం మండలానికి చెందిన బోడ బాపన్నను జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో కందుగుల రాజన్న మంగళవారం బాపన్నకు బాధ్యతలు అప్పగించారు. మాలల హక్కులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాల నాయకులు పాల్గొన్నారు.