హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభానికి సిద్ధం: కలెక్టర్

MDK: మెదక్ మార్కెట్ యార్డ్‌లో హరేకృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ త్వరలో ప్రారంభమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కిచెన్ యంత్రాలను ఆమె పరిశీలించారు. త్వరలో మంత్రి వివేక్ వెంకటస్వామి దీనిని ప్రారంభిస్తారని, దీంతో జిల్లాలోని 395 పాఠశాలల 30 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందుతుందన్నారు.