ఆసియా క్రీడల్లో శ్రీలంకను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ అద్భుత విజయంపై ప్రధాని మోదీ జట్టును అభినందించారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో యువ క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. జట్టులోని ఆటగాళ్లందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడలు
టీమిండియాకు ప్రధాని అభినందనలు


