హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోషకాహారంపై అవగాహన కార్యక్రమం'

అన్నమయ్య: కె.వి.పల్లి మండలం, దేవాండ్లపల్లి అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ శంకరమ్మ ఆధ్వర్యంలో 'పోషణ్ మాహ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు.