హైదరాబాద్: 28°C
తెలంగాణ

రబీ ప్రణాళికపై మంత్రి కీలక ఆదేశం

KMM: రాబోయే రబీ సీజన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్‌ సరఫరాను పరిగణనలోకి తీసుకుని వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించాలని మంత్రి తెలిపారు.