హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రుల పర్యటన..హెలిప్యాడ్‌ను పరిశీలించిన DSP

BDK: అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మంగళవారం మంత్రుల పర్యటన నేపథ్యంలో మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. హెలికాప్టర్‌ రాక నేపథ్యంలో హెలిప్యాడ్‌ను DSP రవీందర్‌రెడ్డి, CI ఎల్లయ్య పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన కోరారు.