హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల్లో చదివే అలవాటు పెంచాలి: కలెక్టర్

ఆసిఫాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి KB రీడతాన్ పఠన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కే.హరిత హాజరై మాట్లాడారు. పుస్తక పఠనంతో విద్యార్థుల్లో జ్ఞానం, ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. 45 స్కూల్ కాంప్లెక్స్‌ల విజేతలు పాల్గొన్నారు. విజేతలకు కలెక్టర్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.