హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక నిమజ్జనానికి మూడు ప్రాంతాలు'

MLG: వెంకటాపురం మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మూడు ప్రాంతాలను మంగళవారం అధికారులు గుర్తించారు. బలకట్ట వాగు–పాత్రాపురం, జిన్నల వాగు–బోదాపురం, పుష్కర ఘాట్–రామచంద్రపురంలో నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. ఘాట్ల వద్ద తాగునీరు, విద్యుత్, లైటింగ్, పారిశుద్ధ్యం, బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.