SRPT: మఠంపల్లి మండలం మట్టపల్లి కృష్ణా నది వద్ద బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ మంగళవారం పరిశీలించారు. పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను క్రమ బద్ధీకరించాలన్నారు.
తెలంగాణ
మట్టపల్లి కృష్ణా నది వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


