హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు భద్రతపై ' అరైవ్ అలైవ్' కార్యక్రమం

RR: ఎల్బీనగర్ ఎంఎస్ విద్యార్థులు, ప్రజలకు రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోల్డెన్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. మీ రక్షణే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సురక్షిత ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.