MNCL: జన్నారం మండలంలోని రహదారిపై పడిపోయిన భారీ చెట్టును పోలీసులు తొలగించారు. ఇవాళ ఉదయం జన్నారం శివారులోని ప్రధాన రహదారిపై భారీ చెట్టు పడిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై సమాచారం అందుకున్న జన్నారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చంద్రమౌళి, సిబ్బంది అక్కడికి చేరుకొని రోడ్డుపై పడిపోయిన భారీ చెట్టును తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
తెలంగాణ
రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించిన పోలీసులు


