హైదరాబాద్: 28°C
వ్యాపారం

గూగుల్‌కు భారీ జరిమానా

టెక్ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య భారీ జరిమానా విధించింది. యూజర్ల లోకేషన్ డేటాను దుర్వినియోగం చేసిన కేసులో సుమారు రూ.4,433 కోట్లు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం డీపీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ జరిమానాతో పాటు, తమ లొకేషన్ డేటా ప్రాసెసింగ్ విధానాలను ఆరు నెలల్లోగా GDPR నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని గూగుల్‌ను డీపీసీ ఆదేశించింది.