హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.170 పెరిగి రూ.1,54,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,41,850 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.