హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పార్కింగ్ గొడవ.. కత్తులతో బెదిరింపులు!

HYD: రాజేంద్రనగర్ PS పరిధిలోని ఉప్పరపల్లి యాదవరెడ్డి బస్తీలో గణేశ్ మండపం వద్ద తీవ్ర కలకలం రేగింది. గణేష్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో వాహనాలు నిలిపే అంశంపై స్థానికుల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో పృథ్వీ, రితిక్ అనే ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయి.. స్థానికులపై కత్తులతో దాడికి యత్నిస్తూ బెదిరింపులకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు.