హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి: అ. కలెక్టర్

BHPL: సిరోంచ–కాటారం ప్రాంతంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ బుధవారం పర్యటించారు. పుష్కరాల దృష్ట్యా ప్రతిపాదించిన ఐదు నూతన తీర్థాల అభివృద్ధి, రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆది ముక్తేశ్వర ఆలయం–సరస్వతీ ఘాట్ రహదారి, నిమజ్జన ప్రాంత ఏర్పాట్లను పరిశీలించారు. కన్నెపల్లిలో భూముల రీసర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.