హైదరాబాద్: 28°C
తెలంగాణ

20వ వార్డులో వీధి కుక్కల స్వైర విహారం

MDK: మెదక్ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులు, కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు .