AKP: నాగవరంలో సుమారు రూ.16.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఇందులో రూ.11.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుతో పాటు, రూ.5 లక్షల ఎంపీపీ నిధుల పనులు ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం


