MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇవాళ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ అనురాధ, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎం స్వప్న, ఐసిటిసి కౌన్సిలర్ రవి, ఆశా వర్కర్ శారద పాల్గొన్నారు. గ్రామీణులు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
వెంకటాపూర్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు


