హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు వార్తలపై పోలీసుల హెచ్చరిక..!

SRCL: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ ఓ.వెంకటేష్ తెలిపారు. షట్టర్‌పై రాయి విసిరిన ఘటనను వక్రీకరించి వైరల్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా పోస్టులు, షేర్లు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.