హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బిక్కనూర్‌లో పాఠశాల ఏర్పాటు చేయాలి'

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. మండల కేంద్రానికి మంజూరైన పాఠశాలను కామారెడ్డి మండలంలో ఏర్పాటు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మండలాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠశాల ఏర్పాటుకు తాము పోరాటం చేస్తామని తెలిపారు.