VKB: సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కొస్గి CHC ప్రధాన గేటు వద్ద రహదారి గుంతలమయంగా మారింది. రోగితో ఆసుపత్రికి వచ్చిన కారు గుంతలో పడిపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. అత్యవసరంగా వచ్చే గర్భిణులు, వృద్ధులు, రోగులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
సీఎం సొంత నియోజకవర్గంలో అధ్వానంగా రోడ్డు


