హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థినుల బతుకమ్మ ఆటతో నిరసన

MDK: మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థినులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా బతుకమ్మ ఆడి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. జీవో 97 వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.