RR: జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అంగన్వాడీ టీచర్లకు ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేశారు. వివేకానందనగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. పిల్లలు, గర్భిణుల సంరక్షణలో అంగన్వాడీల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వారి సంక్షేమానికి, కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: అంగన్వాడీ టీచర్లకు కుక్కర్లు అందజేత


