JN: లింగాల ఘనపురం మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షిస్తూ 9వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్‌లో నామవాచకం, క్రియ, సరైన వాక్య నిర్మాణంపై స్వయంగా బోధించారు. 10వ తరగతిలో ఫిజిక్స్ బోధనను పరిశీలించారు. అదనపు తరగతి గదుల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్


