హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో రోజుకు చేరిన అక్కేం నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతరం నుండి జిల్లెల్ల వరకు అసంపూర్తిగా ఉన్న ఆనంతారం బిక్క వాగు వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని యువజన నాయకుడు అక్కేం నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పార్టీలకతీతంగా వివిధ పార్టీల నాయకులు, యువకులు నాగరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు.