ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన చిన్నారులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అగ్ని ప్రమాద చిన్నారులను పరామర్శించిన MLA


