SRPT: సూర్యపేట- ఖమ్మం జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోతె గ్రామం వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లోపల ఉన్న డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి


