BHPL: భూపాలపల్లి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 2013 జూన్ 20న అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాజు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. స్పందించిన సీఎం అమరవీరుల కోటా కింద రాజు తండ్రి మండల సమ్మిరెడ్డికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షల సాయం


