హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారుల మృతి అత్యంత బాధాకరమన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఘటనకు దారితీసిన కారణాలపై నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.