హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MRPS జాతీయ సదస్సు జయప్రదం చేయాలి'

NGKL: అక్టోబర్ 7 న అమరావతిలో నిర్వహించే ఎమ్మార్పీఎస్‌ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని MRPS రాష్ట్ర నాయకులు సౌట కాశీం పిలుపునిచ్చారు. అచ్చంపేట పట్టణంలో ఇవాళ నిర్వహించిన నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగలు ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.