హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు జిల్లా కోర్టుకు నూతన న్యాయమూర్తి నియామకం

MLG: ములుగు జిల్లా కోర్టుకు నూతన న్యాయమూర్తిగా లక్ష్మీనారాయణ అలిశెట్టిని రాష్ట్ర హైకోర్టు నియమించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు న్యాయమూర్తుల కేటాయింపులో భాగంగా ఈ నియామకం జరిగింది. ములుగు కోర్టుతో పాటు పెద్దపల్లి కోర్టులోనూ ఆయన విధులు నిర్వహించనున్నారు. హైకోర్టు ఉత్తర్వులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.