SRCL: గణేష్ నవరాత్రుల్లో భాగంగా వినాయకుడి మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. స్థానికుల వివరాల ప్రకారం ఈరోజు వేములవాడ బద్ది పోచమ్మ వీధిలో GYC యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మెడలోయూత్ సభ్యులు రూ.500 నోట్ల దండను వేశారు. ఇది గమనించిన ఓ దొంగ నోట్లదండను దొంగిలించి పారిపోయాడు. గమనించిన యూత్ సభ్యులు సదరు దొంగను వెంబడించి పోలీసులుకు అప్పగించారు.
తెలంగాణ
గణేష్ మండపంలో నోట్ల దండ చోరీ.. దొంగ పట్టివేత


