NLG: చందంపేట మండలం బుడ్డోనితండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేనావత్ దస్రు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఇవాళ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దస్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
తెలంగాణ
దస్రు కుటుంబానికి అండగా ఉంటాం:ఎమ్మెల్యే


