BHPL: గోరికొత్తపల్లి గ్రామంలోని 11వ వార్డులో నూతన సైడ్ డ్రైనేజీ నిర్మించాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ నుంచి నీరు నిరంతరం కాలువలోకి రావడంతో చెత్త, పాకురుతో నిండిపోతోందన్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన కాలువ ధ్వంసమై నీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలకు ఆవాసంగా మారిందని తెలిపారు. పాలకవర్గం, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
సైడ్ డ్రైనేజీ నిర్మించాలని ప్రజల డిమాండ్


