హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెన్సీ గణపతికి ప్రత్యేక పూజలు

SDPT: సిద్దిపేటలో పార్వతి ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ గణపతికి రూ. 41.51 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అద్భుత శోభను చేకూర్చారు. మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరెన్సీ నోట్ల అలంకరణతో దివ్యంగా ప్రకాశిస్తున్న వినాయకుని రూపం పట్టణవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ విశేష రూపాన్ని కాంచేందుకు భక్తులు క్యూ కట్టారు.