హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన

RR: కడ్తాల్ మండలంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రావిచెడ్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మఖ్తమాదారం, న్యామతాపూర్, రావిచెడ్ గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, మోటర్లు కాలిపోతున్నాయని వాపోయారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.