హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణానగర్ పంచాయతీలో డీఆర్డీవో తనిఖీలు

WGL: సంగెం మండలంలోని కృష్ణానగర్ గ్రామ పంచాయతీలో డీఆర్డీఓ పద్మజ లేబర్ రిపోర్టుపై సమీక్ష నిర్వహించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిసి ఉపాధి హామీ పనులు, రికార్డులను పరిశీలించారు. కూలీల హాజరు, పనుల పురోగతిపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.