హైదరాబాద్: 28°C
తెలంగాణ

హయత్‌నగర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

RR: హయత్‌నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాలలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న ఒక కేంద్రాన్ని సీజ్ చేశారు. నిబంధనల పరిశీలనలో భాగంగా అధికారులు పలు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.