హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం ఆర్టీసీలో ఎన్నికల సందడి

KMM: ఖమ్మం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికలతో ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల వద్ద ప్రచారం ఊపందుకుంది. మొత్తం 1,808 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమ సమస్యల పరిష్కారం, పనిభారం తగ్గింపుపై దృష్టి పెట్టే సంఘానికే మద్దతు ఇస్తామని కార్మికులు చెబుతున్నారు.