హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అమృత్-2 పనులు వేగవంతం చేయాలి'

KMR: బాన్సువాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, పంప్ హౌస్ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్-2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.52 కోట్లు మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.