హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనంతగిరిని కప్పేసిన మంచు

VKB: జిల్లాలోని అనంతగిరి కొండను దట్టమైన మంచు కప్పేసింది. మంచు తెరల మధ్య కొండల అందాలు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి పరిసరాలైన అనంతగిరిగుట్ట, జంబాపూర్, రాళ్ల చిటంపల్లి, మైలార్ దేవరంపల్లి, పీలారం, గిరిగేట్ పల్లి, అనంతగిరిపల్లి, లక్ష్మీనగర్ తండా తదితర ప్రాంతాల్లో శీతాకాల వాతావరణం కనిపిస్తోంది.