హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై క్షుద్ర పూజలు కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులో సైదాపూర్ మండలంకు వెళ్లే దారిలో క్షుద్ర పూజల కలకలం. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వస్త్రాలతో కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేశారు. అటుగా వెళ్లే వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై నిఘా పెంచాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.