హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆస్పత్రిలో ఓపీ కోసం గంటల కొద్దీ నిరీక్షణ

MLG: ములుగు జిల్లా ఆసుపత్రిలో ఓపీ కోసం రోగులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఒక్కరోజే 766 మంది వైద్యం కోసం రాగా, ఓపీ విభాగంలోని కంప్యూటర్లు పనిచేయకపోవడంతో సిబ్బంది రోగుల వివరాలను రాతపూర్వకంగా నమోదు చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యతో కంప్యూటర్లు పనిచేయలేదని ఆర్ఎంవో డా. సుప్రియ తెలిపారు.